టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ దరఖాస్తు..!

77

మాజీ క్రికెటర్, ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం టీ20 వరల్డ్ కప్‌తో ముగియనుంది. ఐసీసీ టోర్నీ తర్వాత రవిశాస్త్రి కొనసాగే అవకాశాలు లేకపోవడంతో బీసీసీఐ కొత్త కోచ్, ఇతర సహాయక సిబ్బంది కోసం ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రేసులో అందరికంటే ముందున్న రాహుల్ ద్రావిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

భారత జట్టు ప్రధాన కోచ్ గా వచ్చేందుకు ద్రావిడ్ తొలుత ఆసక్తి చూపనప్పటికీ, ఇటీవల దుబాయ్‌లో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీతో భేటీ అనంతరం అంగీకరించినట్టు తెలుస్తోంది. టీమిండియా కొత్త కోచ్ రాహుల్ ద్రావిడేనంటూ ఆ సమయంలోనే కథనాలు కూడా వచ్చాయి. ఇక బోర్డు పెద్దలు రాహుల్ ద్రవిడ్‌కు రూ. 10 కోట్ల వేతనాన్ని ఇస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.