కాజల్ వదిలిన ‘మను చరిత్ర’ సాంగ్‌..

51

టాలీవుడ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న తాజా చిత్రం ”మను చరిత్ర”. ఇందులో మేఘా ఆకాష్ – ప్రియ వడ్లమాని – ప్రగతి శ్రీవాత్సవ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో భరత్ పెదగాని దర్శకునిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అగ్ర కథానాయిక కాజల్ అగర్వాల్ సమర్పణలో ప్రొద్దుటూర్ టాకీస్ బ్యానర్ పై నరాల శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాన్సన్ జోసెఫ్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – టీజర్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ క్రమంలో తాజాగా ‘ఎక్కడ ఉంటాదిరో ఆ పిల్ల’ అనే పాట లిరికల్ వీడియోని కాజల్ అగర్వాల్ రిలీజ్ చేసింది.

ఎక్క‌డ ఉంటాదిరో ఆ పిల్లా ఏ సోట ఉంటాదిరో..ఏ గ‌ల్లిలుంటాదిరో ఆ ఇల్లూ ఏ సందులుంటాదిరో అని హీరోయిన్ గురించి హీరో అండ్ బ్యాచ్ పాడుకుంటున్న పాడుకుంటున్న ఈ పాట క్లాస్‌, మాస్ ట‌చ్‌తో అంద‌రినీ ఆక‌ట్టుకునేలా ఉంది. చంద్ర‌బోస్ అద్బుత‌మైన లిరిక్స్ పాట‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తున్నాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు. వ‌రంగ‌ల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఈ పాట‌ను చిత్రీక‌రించారు. చంద్ర‌బోస్ ఈ పాట‌లో క‌నిపించ‌డం విశేషం. ఈచిత్రానికి గోపీసుంద‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్.

Ekkada Untadhiro Aa Pilla - Lyrical | Manu Charitra | Shiva Kandukuri, Megha Akash | Gopi Sundar