రాహుల్ బర్త్ డే..శుభాకాంక్షల వెల్లువ

15
- Advertisement -

కాంగ్రెస్ అగ్రనేత, రాయ్‌బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ పుట్టినరోజు నేడు. ఇవాళ రాహుల్ బర్త్ డే సందర్భంగా పార్టీలకు అతీతంగా విషెస్ చెప్పారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా రాహుల్‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు చెప్పారు. అన్ని అవ‌రోధాల‌ను ఎదురించే వ్య‌క్తిత్వం ఉన్న మ‌నిషి రాహుల్ అని ..అణ‌గారిని వ‌ర్గ ప్ర‌జ‌లు ప‌క్షాన ఆయ‌న నిలుచుంటార‌ని ఎక్స్ ద్వారా విషెస్ చెప్పారు.

కోపం, ద్వేషం, క‌న్నీళ్ల‌కు వ్య‌తిరేకంగా నిల‌బ‌డ్డ నేత అని, ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పోరాడిన వ్య‌క్తి అని, వెలుతురు చిందిస్తూ ఆశ‌ను రేపాడని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. స‌డ‌ల‌ని ప‌ట్టుద‌ల‌తో రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు రాహుల్ పోరాడిన‌ట్లు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే అన్నారు.

బ్ర‌ద‌ర్ రాహుల్ గాంధీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు అంటూ త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, స‌మాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాద‌వ్ కూడా రాహుల్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు. ఇక తన సెల‌బ్రేష‌న్స్‌కు బ‌దులుగా పేద‌ల‌కు మాన‌వ సాయం చేయాల‌ని పిలుపునిచ్చారు రాహుల్.

Also Read:డిప్యూటీ సీఎంగా పవన్‌ బాధ్యతలు

- Advertisement -