చాలాకాలం తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్నారు సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే. లండన్‌లోని ఓవల్ మైదానంలో జూన్ 7వ తేదీ నుండి జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత జట్టును ప్రకటించగా చోటును సంపాదించారు రహానే. ప్రస్తుత ఐపీఎల్‌లో చెన్నై తరపున ఆడుతున్న రహానే మంచి ఫామ్‌లో ఉన్నారు. దీంతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.
రహానేతో పాటుకేఎస్ భరత్, జయదేవ్ ఉనద్కత్ చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. టెస్టు స్క్వాడ్‌లో రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్, రవిచంద్ర అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, షమీ, సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ ఉన్నారు.
Also Read:ఉరూరా గులాబీ జెండా పండుగ
ప్రస్తుత ఐపీఎల్లో రహానే 199 స్ట్రయిక్ రేటుతో 209 రన్స్ చేశాడు. టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Also Read:IPL 2023 : ఎస్‌ఆర్‌హెచ్ కు.. వార్నర్ శాపం తాకిందా!