శ్రీలంక పరిస్థితి మనకు రాదు: రఘురామ్

43
- Advertisement -

ఆర్బీఐ పనితీరు బాగుందని కితాబిచ్చారు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్. భారత్‌లో తగినంత విదేశీ మారక నిల్వలు ఉన్నాయని..శ్రీలంక లాంటి పరిస్థితి మనకు రాదన్నారు. పాకిస్థాన్ ఎదుర్కొంటోన్న ఆర్థిక స‌మ‌స్య‌లు కూడా భార‌త్‌లో ఉండ‌బోవ‌ని అన్నారు.

ఆర్బీఐ డేటా ప్ర‌కారం జూలై 22 నాటికి భార‌త్‌లో రూ.45.265 ల‌క్ష‌ల కోట్ల విదేశీ మార‌క నిల్వ‌లు ఉన్నాయి. అయితే, కొంత కాలంగా వాటి పతనం కొనసాగుతోంది. జూలై 22తో ముగిసిన వారాంతంలో 91 వేల కోట్ల రూపాయ‌లు తరిగిపోయాయి. ఈ గణాంకాలను ఆర్బీఐ విడుదల చేయగా ర‌ఘురామ్ రాజ‌న్ స్పందించారు.

విదేశీ మార‌క నిల్వ‌లు అడుగంటిపోవడంతో శ్రీలంక ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దీంతో ఆ దేశం ఆర్థికం సంక్షోభంలో కూరుకుపోయింది.

- Advertisement -