కొన్ని లవ్ స్టోరీలు నవ్విస్తాయి. మరికొన్ని ఏడిపిస్తాయి. అతితక్కువగా స్టోరీలు మాత్రమే మనసుకు హత్తుకుంటాయి. సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చినా కూడా ఆ ప్రేమ తాలూకు అనుభూతులు వెంటాడుతుంటాయి. అటువంటి సినిమా జాబితాలో “మళ్ళీ రావా” చేరింది.చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని హీరో సుమంత్ మళ్ళీ రావాతో ఫాంలోకి వచ్చాడు. గౌతమ్ తిన్నమూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా యువత హృదయాలను తాకుతోంది.
పలువురు ప్రముఖులు మళ్ళీ రావా మూవీపై ప్రశంసలు గుప్పించారు. ఈ సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సినిమా బాగుందని కితాబిచ్చారు. మళ్ళీరావా సినిమా ఇటీవలే చూశాను. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. సుమంత్ నటన నాకు బాగా నచ్చింది. అలాగే కెమెరా, సంగీతపరంగా అన్ని కొత్తగా అనిపించాయని తెలిపారు.
హీరోయిన్ నటనతో పాటు చిన్న పిల్లలు చాలా బాగా చేశారు. అలాగే ఫస్ట్ టైం దర్శకత్వం వహించిన గౌతమ్ కు, మరియు ఈ సినిమాతో నిర్మాతగా మారిన రాహుల్ యాదవ్ కి ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ఆందరూ చూడాల్సిన సినిమా…” అని అన్నారు.