నటుడు-కొరియోగ్రాఫర్-దర్శకుడు రాఘవ లారెన్స్ కధానాయకుడిగా కతిరేశన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రుద్రుడు’. ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కతిరేశన్ సమర్పిస్తున్నారు. 2022 క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు గతంలో వెల్లడించిన నిర్మాతలు తాజాగా రిలీజ్ డేట్ ని ఖరారు చేశారు. డిసెంబర్ 23న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సంధర్భంగా విడుదల చేసిన సెకండ్ లుక్ పోస్టర్ లో లారెన్స్ లుక్ ఇంటరెస్టింగ్ గా వుంది. వైన్ బాటిల్ ని చేతిలో పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ టెర్రిఫిక్ గా వుంది.
‘ఈవిల్ ఈజ్ నాట్ బోర్న్ , ఇట్ ఈజ్ క్రియేటడ్’ అనే ఉపశీర్షికతో వస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి కూడా భారీ స్పందన వచ్చింది. శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుండగా లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఆంథోనీ ఎడిటర్ గా , శివ-విక్కీ స్టంట్స్ కంపోజ్ చేస్తున్నారు.
తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్ తదితరులు
సాంకేతిక విభాగం:
దర్శకత్వం – కతిరేశన్
నిర్మాత- కతిరేశన్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పీ
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డీవోపీ : ఆర్ డి రాజశేఖర్-ఐఎస్ సి
ఎడిటర్: ఆంథోనీ
స్టంట్స్: శివ – విక్కీ