ఆప్‌కు భారీ షాక్..బీజేపీలోకి రాఘవ్ చడ్డా

3
- Advertisement -

ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది. పంజాబ్‌ నుంచి ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చడ్డా శుక్రవారం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు సంధీప్ పాఠక్, అశోక్ మిట్టల్ సహా మొత్తం ఏడుగురు ఆప్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో విలీనం అవుతున్నట్లు తెలిపారు.

రాఘవ్ చడ్డా మాట్లాడుతూ…రాజ్యసభలో ఆప్‌కు చెందిన మేము రెండు మూడవ వంతు సభ్యులు భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం బీజేపీలో విలీనం కావాలని నిర్ణయించుకున్నాం అని చెప్పారు.

ఆప్ తన అసలు సిద్ధాంతాలు, విలువల నుంచి దారి తప్పిందని, ఇప్పుడు ప్రజల ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు.

రాజకీయాల్లోకి రాకముందు తాను చార్టర్డ్ అకౌంటెంట్‌నని, అవినీతి రహిత భారత్ లక్ష్యంతో ఆప్‌ను నిర్మించామని రాఘవ్ గుర్తుచేశారు. “నేను తప్పు పార్టీలో ఉన్న సరైన వ్యక్తిని అనిపించింది. అందుకే ఆప్‌ను వీడి ప్రజలకు దగ్గరవుతున్నాను” అని వ్యాఖ్యానించారు.

ఈ పరిణామంపై ఆప్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ…“ఆపరేషన్ లోటస్ ద్వారా పంజాబ్‌లోని భగవంత్ మాన్ ప్రభుత్వాన్ని బలహీనపరచే ప్రయత్నం చేస్తోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.

Also Read:విజయ్-త్రిష..గిల్లీ సాంగ్‌ మళ్లీ వార్తల్లో!

- Advertisement -