AA23:అదిరే అప్‌డేట్

1
- Advertisement -

అల్లు అర్జున్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం ‘AA23’ గురించి సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమాపై లోకేష్ కనగరాజ్ అసోసియేట్ మరియు కో-రైటర్ రత్న కుమార్ కీలక అప్‌డేట్స్ అందించారు.

ఈ సినిమా కేవలం పాన్-ఇండియా చిత్రం మాత్రమే కాదని, దీని కథాంశం అంతర్జాతీయ స్థాయిలో ఉంటుందని రత్న కుమార్ పేర్కొన్నారు. కథలోని వైవిధ్యం వల్ల ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులు మే నెల రెండో వారం నుండి ప్రారంభం కానున్నట్లు ఆయన వెల్లడించారు. అల్లు అర్జున్‌తో దాదాపు మూడు వారాల పాటు కథా చర్చలు జరిగాయని, ఆయనకు కథ బాగా నచ్చిందని సమాచారం. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తుండటంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప-2 తర్వాత బన్నీ చేయబోయే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాలలో ఇది ఒకటిగా నిలవనుంది.

Also Read:బెంగాల్‌లో సుపరిపాలన శకానికి నాంది!

- Advertisement -