7 వేల కిలోమీటర్లు ప్రయాణించి రాఫెల్ యుద్దవిమానాలు భారత్‌కు చేరుకున్నాయి. రాఫెల్ యుద్ద విమానాల చేరికతో భారత వైమానిక దళం మరింత బలపడింది. ఫ్రాన్స్,ఈజిప్టు,ఖతర్ తర్వాత మన దగ్గరే రాఫెల్ యుద్ద విమానాలు ఉన్నాయి. మొత్తం 36 యుద్ద విమానాలు తయారుచేయడానికి భారత్ ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్‌తో ఒప్పందం కుదుర్చుకోగా తొలిదశలో ఐదు యుద్ద విమానాలు భారత్‌కు వచ్చాయి. అంబాల ఎయిర్‌వేస్‌లో రాఫెల్ యుద్ద విమానాలకు ఘన స్వాగతం పలికారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.17వ వైమానిక స్వాడ్రన్‌లో రాఫెల్ యుద్ధ విమానాలు చేరనున్నాయి.
రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఙానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటెరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ (బీవీఆర్) ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్‌ను సంధించే సత్తా దీనికి ఉంది. ఇలాంటి సాంకేతిక పరిజ్ఙానం ఉన్న మొట్టమొదటి యుద్ధ విమానం ఇదే. విజువల్ రేంజ్‌ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడార్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు. ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3,700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం.
తొమ్మిది టన్నుల ఎక్స్‌టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాల సొంతం. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్త ఉన్న స్కాల్ప్ మిస్సైల్స్‌ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది.
ఒక నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 ఎంఎం క్యానన్‌ను ఇవి సంధించగలవు. రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేకాఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు.