హీరోయిన్ రాధికా ఆప్టేకి ఛాన్సొస్తే చాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది. అటు గ్లామర్లోనూ..ఇటు నటనలోనూ తనదైన ట్యాలెంట్‌ని బయటపెట్టేస్తుంది ఆప్టే.
అంతేనా..? ఇతర హీరోయిన్లు చెయ్యలేని క్యారెక్టర్లను ఎలాంటి మొహమాటం లేకుండా చెయ్యగలదు ఈ అమ్మడు. ఇదిలా ఉంచితే.. ఆమె వ్యక్తిగత సెల్ఫీలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అప్పట్లో హాట్ టాపిక్కు తెరలేపింది ఈ హాట్ బ్యూటీ. అంతేకాకుండా ఓ సినిమాలో నగ్నంగా నటించి సంచలనం సృష్టించింది.
ఇక అసలు విషయానికొస్తే..ఈ సెక్సీ బ్యూటీ ఫొటోగ్రాఫర్లపై ఫైర్ అయింది. రాధికా ఆప్టే ప్రస్తుతం ‘బజార్’ అనే బాలీవుడ్ సినిమా షూటింగులో పాల్గొంటోంది. ముంబైలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ లో కొంతమంది ఫోటోగ్రాఫర్ల కెమెరాలకు దొరికిపోయింది రాధిక ఆప్టే. షూటింగ్ అనంతరం లంచ్ కోసం ఆమె తన వ్యానిటీ వ్యాన్ లోకి వెళ్లింది.
కొంతసేపటి తరువాత బయటికొచ్చింది ఈ అమ్మడు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫోటోగ్రాఫర్లు ఆమె పర్సనల్ మూమెంట్స్ పై కెమెరాలను క్లిక్ మనిపించారు. తన అనుమతి తీసుకోకుండా ఫోటోలను తీయడం పట్ల ఆమె అభ్యంతరాన్ని .. ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఆ ఫోటోలను డిలీట్ చేయమంటూ డిమాండ్ చేసింది. ఈ సినిమాకి సంబంధించి రాధికా ఆప్టే లుక్ ఇప్పట్లో బయటికి రాకుండా చూడాలని దర్శక నిర్మాతలు బలంగా అనుకున్నారట. అందుకే మీడియా ఫొటోగ్రాఫర్లపై రాధిక ఆప్లే ఫైర్ అయిందని అంటున్నారు.