అనుభ‌వం లేదు అయినా మ‌ద్ద‌తిస్తా: రాధికా ఆప్టే

285
Radhika Apte support #MeToo campaign
- Advertisement -

హాలీవుడ్ నిర్మాత హార్వే విన్‌స్టైన్ చేసిన లైంగిక దాడులు అక్క‌డ ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తున్నాయి. ప‌లువురు హీరోయిన్ల‌పై అత‌డు లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్టు తేల‌డంతో అత‌డి భార్య విడాకులు కూడా ఇచ్చేసింది. తాజాగా బాలీవుడ్‌లో కూడా ఈ లైంగిక దాడుల ఉదంతం పెద్ద దుమారమే రేపుతోంది.. దీనిపై బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు మాట్లాడటానికి సిద్దపడుతున్నారు.

Radhika Apte support #MeToo campaign

ఇలాంటి సెక్స్ ఆరోపణలకు ఎప్పుడూ రెడీగా ఉండే.. రాధికా ఆప్టే కూడా స్పందించారు..ఈ అమ్మడు ముంబాయ్ లో జరుగుతున్న మామి ఫెస్టివల్ లో ఈ అంశంపై మాట్లాడింది. #మీటూ అంటూ సాగుతున్న క్యాంపెయిన్ కు మద్దతిస్తున్నా అంటూ అమ్మడు ఏం చెప్పిందంటే.. ”నాకెప్పుడు అలాంటి సిట్యుయేషన్ తారసపడలేదు.. అలాంటి బలవంతపు సెక్స్ నేను చేయలేదు కాని.. అలాంటివి చాలా విన్నాను. చదివాను. అయితే బాలీవుడ్ లో కూడా అలాంటివి ఉన్నాయి అంటే ఆశ్చర్యపోతున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ #మీటూ క్యాంపెయిన్ వలన చాలామంది ఓపెన్ అవుతున్నందుకు” సంతోషంగా ఉందంటు తన మద్దతును తెలియజేసింది ఈ బోల్డ్‌ భామ.

మరి రక్తచరిత్ర.. లెజెండ్ వంటి సినిమాల్లో నటించి తెలుగు వారికి సుపరిచితమైన ఈ సుందరి.. గతంలో సౌత్ ఇండియాలో నన్ను రూమ్ కు రమ్మని చాలామంది ప్రొడ్యూసర్లు బలవంతం చేశారు అంటూ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. మరి ఆ విషయాలను మాత్రం అమ్మడు మర్చిపోయినట్లుంది..!

- Advertisement -