ర’కూల్‌’గా రిక్షా తొక్కేసింది..

194
Rakul Preet Singh rides a cycle rickshaw
- Advertisement -

రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు రిక్షావాలా అవతారమెత్తింది. రోడ్డుపై ఉన్న ఓ రిక్షాను తీసుకొని అందులో ఆ రిక్షా యజమానిని ఎక్కించుకొని దాన్ని నడుపుకుంటూ వెళ్లింది. ఉన్నట్టుండి రకుల్‌ ఇలా చేయడానికి కారణమేంటీ అనుకుంటున్నారా? ఈ బ్యూటీ ఇదంతా చేసింది ఓ సినిమా కోసం.

ప్రస్తుతం తమిళంలో కార్తీ హీరోగా ‘ధీరన్ అధికరం ఒండ్రు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. కథలో భాగంగా సినిమాలో హీరోయిన్ రిక్షా తొక్కే సన్నివేశం ఒకటి ఉంది. ఆ సీన్ కోసం రకుల్ రిక్షా తొక్కగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Rakul Preet Singh rides a cycle rickshaw

అంతేకాకుండా ఈ అమ్మడు తాను రిక్షా తొక్కిన ఎక్స్‌పీరియన్స్‌ని కూడా షేర్‌ చేసుకుంది. ”రిక్షా తొక్కడానికి నేను భయపడలేదు కానీ రిక్షా యజమాని మాత్రం భయపడ్డాడు. నేను ఎక్కడ రిక్షాను పాడు చేస్తానో అని. అతను బ్రేక్ ఎక్కడ ఉంటుంది.. ఎలా బ్రేక్ వేయాలి అని నాకు చాల క్లియర్‌గా చెప్పాడు. భలే ఉంది లెండి రిక్షాను తొక్కుతుంటే” అంటూ తెగ సంబరపడిపోయింది రిక్షావాలా రకుల్.

- Advertisement -