సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసిన ‘రాధే శ్యామ్’టీజర్‌..

30

టాలీవుడ్‌ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగే జంటగా నటించిన చిత్రం ‘రాధే శ్యామ్’. యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా 2022, సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. కాగా ఈ సినిమాను ఇండియన్ ఐదు భాషలతో పాటు చైనీస్, జాపనీస్ భాషల్లోనూ రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది చిత్రబృందం.

ఈ నేసథ్యంలో శనివారం ఈ మూవీ టీజర్‌ను ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23న రిలీజ్ చేశారు. ఈ టీజర్ మైండ్ బ్లోయింగ్ వ్యూస్‌తో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. ఇందులో ప్రభాస్‌ విక్రమాదిత్య అనే హస్త సాముద్రిక నిపుణుడి పాత్రలో కనిపించబోతున్నారు. దీనికి సంబంధిచిన టీజర్‌నే మేకర్స్ విడుదల చేయగా.. కేవలం 20 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్‌కి పైగా రాబట్టడం ఇప్పుడు విశేషం.

ఇంతవరకు టాలీవుడ్‌లో ఏ మూవీ టీజర్‌కు రాని విధంగా భారీ వ్యూస్‌ను రాబడుతూ దూసుకెళ్తుంది. దాంతో సైలెంట్‌గా ఉన్న ‘రాధే శ్యామ్’ టీజర్ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుదని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇక ఈ టీజర్ సినిమాపై ఇన్నాళ్ళు ఉన్న అంచనాలను ఒక్కసారిగా ఊహించని స్థాయికి పెంచేసింది.

Radheshyam Teaser | Introducing Prabhas as Vikramaditya | Pooja Hegde | Radha Krishna Kumar