రాధేశ్యామ్..రన్‌టైం ఎంతో తెలుసా?

79
radheshyam
- Advertisement -

ఎట్టకేలకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయిన సంగతి తెలిసిందే. మార్చి 11న సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకురానుండగా తాజాగా సినిమాకు సంబంధించి మరో ప్రచారం జరుగుతోంది.

‘రాధేశ్యామ్’ హిందీ వెర్షన్ సెన్సార్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిర్మాతలు ఈ చిత్రం కోసం క్రిస్ప్ రన్ టైమ్‌ను లాక్ చేసారు. ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 31 నిమిషాలు ఉందని సమాచారం. రాధేశ్యామ్’ వంటి భారీ బడ్జెట్ లవ్ డ్రామాకు ఇలాంటి క్రిస్ప్ రన్‌టైమ్‌ను లాక్ చేయడం ఆసక్తికరంగా ఉంది.

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ ఒక జ్యోతిష్య నిపుణుడి పాత్రలో నటిస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ని అన్ని భాషల్లో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందిస్తున్నారు.

- Advertisement -