సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడా అని అంతా ఎదురుచూస్తుండగా తాజాగా ఓ అభిమాని చేసిన పని విషాదాన్ని నింపింది.
రాధే శ్యామ్ అప్ డేట్స్ ఇవ్వడం లేదని సూసైడ్ చేసుకున్నారు. మీరు అప్‌డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పడం లేదు. కనీసం నా చావు చూసైనా రాధేశ్యామ్ అప్‌డేట్ ఇస్తారని అనుకొంటున్నాను. చాలా రోజులు వేచి చూసేలా చేశారు. మేము వెయిట్ చేశాం. ఇక చాలు సార్ అంటూ అని అభిమాని ఆందోళన చెందుతూ సూసైడ్ లెటర్ లో ఓ అభిమాని తన ఆవేదనను తెలిపాడు. అంతేకాదు నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీమ్, డైరెక్టర్ రాధాకృష్ణ మాత్రమే. ఈ యూనిట్‌కు చిన్న మనవి.. ఫ్యాన్స్ ఎమోషన్స్‌తో ఆడుకోవద్దు.. ఇట్లు.. రెబెల్ స్టార్ ఫ్యాన్ అంటూ లేఖలో పేర్కొన్నాడు.