జనవరి 14నే రాధేశ్యామ్..!

94
Radhe Shyam
- Advertisement -

సాహో తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. జిల్ ఫేమ్ రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకోగా యు.వి.కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దీంతో రెండురోజుల ముందుగానే జనవరి 12న విడుదల చేస్తారనే ప్రచారానికి తెరపడింది.

ముందు ప్రకటించిన విధంగానే జనవరి 14న ‘రాధేశ్యామ్‌’ను థియేటర్లలో విడుదల చేస్తాం అని స్పష్టం చేశారు మేకర్స్‌. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

- Advertisement -