బిగ్ బాస్ 5..అతడే నా ఫేవరేట్..!

40
Sundeep Kishan

బిగ్ బాస్ 5 తెలుగు విజయవంతంగా 25 ఎపిసోడ్స్‌ పూర్తి చేసుకుంది. రోజురోజుకు ఇంటి సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా హౌస్‌లో మిస్టర్‌ కూల్‌గా ఉన్నారు బుల్లితెర నటుడు మానస్. ఇంటి సభ్యులు కూడా మానస్‌ని మిస్టర్ కూల్‌గా పిలుస్తుంటారు.

బయట ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తున్న మానస్‌…తాజాగా టాలీవడ్‌ హీరో సందీప్‌ కిషన్‌ను మెప్పించారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక వీడియోని రిలీజ్ చేసిన సందీప్… మానస్‌కు సపోర్ట్‌ చేయమని తెలిపారు. అయితే ఇది బిగ్ బాస్ షో ప్రారంభానికి ముందే తీసిన వీడియో అయినా ఇప్పుడు రిలీజ్ చేయడం….సందీప్‌ కిషన్‌ జడ్జిమెంట్ కరెక్టే అని పించేలా ఉంది.

బిగ్‌బాస్‌ షోలో నాకు నచ్చిన, బాగా కావాల్సిన వ్యక్తి మానస్‌ నాగులపల్లి పాల్గొన్నాడు. ఎంతో మంచి మనసున్న అతడు మీ అందరికీ నచ్చుతాడనుకుంటున్నాను. మానస్‌ చాలామంది మనసులు గెలుచుకుని బయటకు వస్తాడని కోరుకుంటూ ఆల్‌ ద బెస్ట్‌, లవ్‌ యూ అని చెప్పుకొచ్చాడు.