ప్రభాస్ – పూజా మధ్య క్లాష్‌..మేకర్స్ క్లారిటీ..!

32
pooja

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్‌. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కృష్ణంరాజు నిర్మిస్తుండగా ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. 2021‘సంక్రాంతి’ సందర్భంగా జనవరి 14న సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమా షూటింగ్ సందర్భంగా ప్రభాస్ – పూజా హెగ్డే గ్యాప్ వచ్చిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్, పూజాహెగ్డేకు పడట్లేదని వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని, అవన్నీ నిరాధారమైన వార్తలని, ఈ స్టార్స్ ఇద్దరూ బాగున్నారని చెప్పారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ అద్భుతమని, ఈ జంట తెరపై అందరినీ అలరిస్తుందని అన్నారు.

ఇక “రాధే శ్యామ్” సినిమా 1970ల కాలంలో యూరప్ నేపథ్యంలో ఉంటుంది. ప్రభాస్ దక్షిణాది నుండి బాలీవుడ్ వరకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.