రాధేశ్యామ్ సినిమా తర్వాత చాలా కాలం వరకు దర్శకుడు రాధా కృష్ణ కుమార్ పేరు వినిపించలేదు. మళ్లీ మరో సినిమా యువి సంస్థలోనే వుంటుందని, అందుకే రాధా కృష్ణ కుమార్ అక్కడే వుండి పని చేసుకుంటున్నారని టాలీవుడ్ లో ఇన్నాళ్లు టాక్ నడిచింది. అయితే, గత నెలలో రాధా కృష్ణ కుమార్ తన క్యాంప్ మార్చారని తెలుస్తోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ దగ్గర వున్నారని, ప్రస్తుతం ఎవరైనా ఓ స్టార్ హీరో కరుణా కటాక్షాల కోసం రాధా కృష్ణ కుమార్ నిత్యం కథపై కసరత్తులు చేస్తున్నాడట. హీరో గోపీచంద్ తో ఓ ప్రాజెక్టు ను రాధా కృష్ణ కుమార్ చేయబోతున్నారని ఆ మధ్య వార్తలు వినిపించాయి. కానీ, ప్రస్తుతం హీరో మారే ఛాన్స్ ఉంది. అందుకే రాధా కృష్ణ కుమార్ యువి సంస్థ నుంచి సితార దగ్గరకు వచ్చారు.
రాధా కృష్ణ కుమార్ రాసుకున్న కథ హీరో దుల్కర్ సల్మాన్ ఖాన్ కి బాగా సెట్ అవుతుంది. అందుకే.. దుల్కర్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే రాధా కృష్ణ దుల్కర్ దగ్గరకు వెళ్లి వస్తున్నారని వినిపించడం ప్రారంభమైంది. దుల్కర్ డేట్లు సితార సంస్థ దగ్గర వున్నాయి. మహానటి తర్వాత సితారకి ఓ సినిమా చేస్తా అని దుల్కర్ కమిట్ అయ్యాడు. కాబట్టి, దుల్కర్ తమకు చేయాల్సిన సినిమాని రాధా కృష్ణ కుమార్ తో సెట్ చేయాలని సితారా భావిస్తోంది. మరి ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..