ఇనయ – శ్రీహాన్ రొమాన్స్ అదుర్స్!

110
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 86 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా టికెట్‌ టు ఫినాలే టాస్క్ ఆసక్తికరంగా సాగింది. ఇనయ , శ్రీహాన్..ఇద్దరూ హౌస్‌లో ఉప్పు – నిప్పు. అయితే కొద్దిరోజులుగా శ్రీహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇనయ, కీర్తిలతో బాగా క్లోజ్ అయిపోయారు శ్రీహాన్.

కీలకమైన టికెట్ టు ఫినాలే టాస్క్‌లో ఈ ఇద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. స్నో‌మెన్‌పై దాడి చేయాలని బిగ్ బాస్ చెప్తే.. శ్రీహాన్, ఇనయలు ఒకరిపై ఒకరు సుతిమెత్తగా దాడి చేసుకుంటూ కనిపించారు. ఒకర్నొకరు పట్టుకుని.. లాక్కుని రొమాన్స్ పండించారు. వీరిద్దరిని చూసి శ్రీసత్య.. ‘మీరిద్దరూ ఏం చేస్తున్నారు?’ అని అడిగేసింది. ఆ టైంలో ఆదిరెడ్డి, రేవంత్‌లు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అయితే హైలైట్. శ్రీసత్య కంటిపై రెప్ప వేయకుండా వాళ్లిద్దరి సుతిమెత్తని దాడిని చూస్తూ ఉండిపోయింది.

తర్వాత శ్రీసత్యతో ఇనయ..ఎటాక్ చేశాను అని ఇనయ తెగ సిగ్గుపడిపోతూ చెప్తే.. అది ఎటాక్‌లా లేదు.. కావాలంటే టెలికాస్ట్‌లో చూసుకోండి అంటూ శ్రీసత్య ఇచ్చి పంచ్‌ అయితే హైలైట్. పైకి నవ్వుతూనే మాట్లాడుతున్నా.. ఇనయ-శ్రీహాన్‌లు క్లోజ్ కావడం.. ఈమె బాగా కాలినట్టే అనిపించింది. లాస్ట్‌లో ఇనయతో బాగానే చేశావే.. ‘నువ్ హ్యాపీనే కదా..’ శ్రీసత్య శ్రీహాన్ బుగ్గపట్టుకుని అడగడం.. అక్కడ వచ్చే ఆర్ఆర్ మామూలుగా లేదు. వీరిద్దరి కెమిస్ట్రీ చూస్తే బిగ్ బాస్ 5లో షణ్ముఖ్ – సిరి గుర్తుకొచ్చారు. అయితే కొద్దితేడా మాత్రం ఉంది. సిరి- షణ్ముఖ్ తొలి రోజు నుండే రొమాన్స్ తో రచ్చ చేస్తే శ్రీహాన్ – ఇనయ మాత్రం కాస్త లేటుగా ఘాటు రొమాన్స్ కు తెరలేపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -