గ్రీన్ ఛాలెంజ్.. మొక్కలు నాటిన రాచకొండ సీపీ

505
Cp
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కు రోజురోజుకు అనూహ్య స్పందన వస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగస్వాములవుతున్నారు. తాజాగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటారు. హైదరాబాద్ లోని సీపీ కార్యాలయంలో ఆయన మూడు మొక్కలు నాటారు. ఇంత కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు అభినందనలు తెలిపారు సీపీ మహేశ్ భగవత్. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాల్సిందిగా సూచించారు.

రాష్ట్రంలో ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా దాదాపు 4 కోట్ల మొక్కలు నాటడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలన్న సీపీ.. మరో నలుగురికి సవాలు విసిరారు. అందులో.. టాలీవుడ్ సూపర్ స్టార్.. మహేష్ బాబు, నటుడు షియాజీ షిండే, పూణే సీపీ వెంకటేశం, మానిష్ సాబూ( ఇన్ఫోసిస్ పోచారం డీసీ హెడ్) ఉన్నారు.

cp Sappling

- Advertisement -