ఆచార్యతో రత్తాలు!

270
rai
- Advertisement -

రత్తాలు రత్తాలు అంటూ ఖైదీ నెంబర్ 150తో మెగాస్టార్ చిరంజీవితో స్టెప్టులేసి మెప్పించిన బ్యూటీ లక్ష్మీ రాయ్‌. ఈ సినిమా తర్వాత రత్తాలుగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేసిన లక్ష్మీ రాయ్‌ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో తోబ తోబ అంటూ మెప్పించింది.

అయితే తాజాగా మరోసారి మెగాస్టార్‌తో ఆడేందుకు సిద్ధమైంది రత్తాలు. ఆచార్య సినిమాలో చిరుతో అదిరిపోయే పాటకు డ్యాన్స్ చేసింది రత్తాలు. ఖైదీ నెంబర్ 150లో అదరిపాటకు స్టెప్పులేసిన రత్తాలు ఆచార్యతో ఏ విధంగా డ్యాన్స్‌ చేసిందనేది అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘ఆచార్య’ షూటింగ్ ఇటీవలే పున:ప్రారంభమైంది. ప్రస్తుతం చిరు కూడా షూటింగ్‌లో పాల్గొంటున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడు.

- Advertisement -