కర్ణాటకలో రాత్రి పూట కర్ఫ్యూ!

47
karnataka

యుకేలో కొత్త రకం కరోనా వైరస్ వెలుగుచూడటంతో ప్రజలంతా భయాందోళనకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే భారత్‌..బ్రిటన్ నుండి వచ్చే విమానాలపై ఆంక్షలు విధించగా తాజాగా పలురాష్ట్రాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలను ముమ్మరం చేశాయి.

ఈ క్రమంలో నేటి నుండి జనవరి 2 వరకు రాత్రి 10 గంట‌ల నుంచి ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ కొన‌సాగుతుంద‌ని తెలిపారు సీఎం యెడియూరప్ప. ప్రజలంతా సహకరించాలని కోరారు.

కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ కార‌ణంగానే రాష్ర్టంలో నైట్ క‌ర్ఫ్యూ విధించామ‌ని పేర్కొన్నారు. నేటి నుంచి జ‌న‌వ‌రి 2 వ‌ర‌కు రాత్రిళ్లు ఎలాంటి సెల‌బ్రేష‌న్స్‌కు అనుమ‌తి ఇవ్వ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.