అర్జున్‌ను హగ్‌ చేసుకోమన్న రాయ్ లక్ష్మి..

246
- Advertisement -

సినిమాల్లో తెర ముందు గొప్పగా నటించి మెప్పించారంటే దాని వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని రొమంటిక్‌ సన్నివేశాలు నటించాలంటే సిగ్గు, బిడియం వలన సరిగా చేయలేకపోతారు. తెరపై సన్నివేశం బాగా వచ్చిందంలే దాని వెను ఆసక్తికరమైన విషయం ఉండకుండా ఉండదు మరి.

తమిళ్ వర్ధమాన నటుడు అర్జున్ అలాంటి విషయాన్ని ఒకటి చెప్పుకొచ్చాడు. తమిళ్ చిత్రాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఈ కుర్రాడు.. ఎక్స్ వీడియోస్ చిత్రంతో మంచి గుర్తింపు పొందాడు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన బెంగళూరు డేస్ చిత్రాన్ని తమిళంలో తీసిన ప్రాజెక్టులో అర్జున్ ఒక క్యారెక్టర్ చేశారు.

Raai Laxmi

బెంగళూరు డేస్ చిత్రంలో హీరోయిన్ రాయ్ లక్ష్మికి ప్రియుడిగా నటించాడు. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మితో ఓ రొమాంటిక్ సన్నివేశంలో నటించాల్సి ఉంది. అయితే స్వతహాగా బిడియస్తుడనైన అర్జున్ ఆమెతో సన్నిహితంగా నటించలేకపోయానని చెప్పాడు. కానీ ‘భయపడకు. ఇదంతా యాక్షన్ లో భాగమే. గట్టిగా కౌగిలించుకో’ అంటూ లక్ష్మి తనకు ధైర్యం చెప్పిందని… ఆమె ఇచ్చిన ధైర్యంతోనే తాను ఆ సన్నివేశాన్ని కరెక్ట్ గా చేయగలిగానని చెప్పాడు.

- Advertisement -