నాగ్‌-నాని మూవీ టైటిల్..?

265
- Advertisement -

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ సినిమాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం నాగార్జున – నాని మల్టీస్టారర్ పై కూడా ప్రేక్షకుల్లో అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా సంబంధించని టైటిల్ ఏమిటనే విషయంపై చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు కొన్ని టైటిల్స్‌ని చిత్ర బృందం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.

Akkineni Nagarjuna

నాగ్-నానీ సినిమా కోసం అక్కినేని నాగేశ్వరరావు హిట్టు సినిమాపై ఇటీవల చర్చలు జరినట్లు సమాచారం. ఏఎన్నార్ కెరీర్ లోనే ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచిన దేవదాసు టైటిల్ ను ఈ మల్టీస్టారర్ కి ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. యువ దర్శకుడు శ్రీ రామ్ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా..ప్రముఖ నిర్మాత సి.అశ్వినిదత్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సినిమాలో ఎంతో కీలకమైన ఎమోషనల్ సీన్స్ ను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది.

కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ‘మళ్ళీరావా’ హీరోయిన్ ఆకాంక్ష సింగ్ నాగ్ సరసన నటిస్తుండగా, నానికి జోడీగా ‘ఛలో’ భామ రష్మిక మందాన్న కనిపిస్తుంది. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 12న విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -