‘ఎన్టీఆర్’ కోసం బెంగాలీ నటుడు..

224

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్ ను బాలకృష్ణ ప్రతిష్టాత్కకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న ఈ బయోపిక్ లో కీలకమైన పాత్రల కోసం టాలీవుడ్, బాలీవుడ్ కు చెందిన పలువురు నటులను క్రిష్, బాలయ్య ఎంపిక చేస్తున్నారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ కి సంబంధించిన నటీనటుల ఎంపిక ప్రక్రియ చురుకుగా జరుగుతోంది. విశిష్టమైన ఈ ప్రాజెక్టులో ఒక్కొక్కరూ జాయిన్ అవుతున్నా కొద్దీ అందరిలో ఆసక్తి పెరుగుతూ వస్తోంది.

Nandamuri Balakrishna

ఈ నేపథ్యంలో తాజాగా ‘ఎన్టీఆర్’ మూవీ కోసం ఒక కీలకమైన పాత్రకు బెంగాలీ నటుడు ‘జిషూ సేన్’ ను తీసుకున్నారు. ఎన్టీఆర్ జీవితచరిత్రలోఎల్వీ ప్రసాద్ ప్రాధాన్యతను ఎంతో ఉంది. అందుకే ఈ పాత్రకి గాను క్రిష్ ‘జిషూ సేన్’ ఎంపిక చేసుకున్నారు. ఇంతకుముందు జిషూ సేన్ క్రిష్ దర్శకత్వం వహించిన ‘మణికర్ణిక’లో ‘గంగాధరరావు’ పాత్రను పోషించాడు.

Jisshu Sen Gupta

ఎన్టీఆర్ ను ‘మనదేశం’ సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయం చేసింది ఎల్వీ ప్రసాద్. ఈ సినిమాలో ఎన్టీఆర్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడు. ఈ సినిమా నుంచే నటుడిగా ఎన్టీఆర్ ప్రయాణం మొదలైంది. ఇక నటుడిగా .. దర్శక నిర్మాతగాను ఆణిముత్యాల్లాంటి ఎన్నో అపురూప చిత్రాలను అందించి ఎల్వీ ప్రసాద్ ఎంతో ప్రత్యేకతను సంపాదించుకున్నారు.