యంగ్ టైగర్ ఎన్టీఆర్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ టెంపర్. ఈసినిమా బాక్సాఫిస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. భారీ కలెక్షన్లతో ఎన్టీఆర్ సినిమాల్లో కీలకంగా నిలిచింది. ఇక ఈచిత్రంలో ఎన్టీఆర్ నటన హైలెట్ గా నిలిచిందని చెప్పుకోవచ్చు. ఈమూవీని బండ్ల గణేశ్ నిర్మించగా వక్కంతం వంశీ కథను అందించారు. ఈసినిమాలో కానిస్టేబుల్ గా పాత్రలో చేసిన పోసాని కృష్ణమురిళి స్ధానంలో మొదట ఆర్. నారాయణ మూర్తిని అడిగారన్న విషయం తెలిసిందే.
దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో ఎన్టీఆర్ ఇద్దరు వచ్చి అడిగినా తాను ఆ పాత్రలో నటించబోనని స్పష్టం చేశారు. తాజాగా ఆయన ఈవిషయంపై ఓ ఇంటర్యూలో వివరించారు. టెంపర్ సినిమాలో అంత మంచి క్యారెక్టర్ ను నాకు ఇవ్వడానికి ముందుకు వచ్చిన దర్శకుడు పూరీ జగన్నాథ్ కు ధన్యవాదాలు తెలిపారు. కేవలం ఆ వేషం ఆర్.నారాయణమూర్తి వేస్తే సినిమా ఆడేస్తుందని ఆ పాత్రను నాకు ఆఫర్ చేయలేదు.
నాతో ఒక గొప్ప వేషం వేయిద్దాం. ఒక డిఫరెంట్ వేషం వేయిద్దాం అన్న ఉద్దేశంతో నాకు ఇవ్వాలనుకున్నారు. ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరో స్థాయికి ఎదిగాను. ఇక నేను సినిమాలు చేస్తే ఐదారేళ్లకు మించి చేయను. అందుకే మళ్లీ నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేయకూడదని అనుకున్నానని తెలిపారు.