అభివృద్ధిలో సిరిసిల్ల టాప్‌:కేటీఆర్

279
ktr siricilla
- Advertisement -

అభివృద్ధిలో సిరిసిల్ల టాప్ పొజిషన్‌లో నిలిచిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌లో జరిగిన టీఆర్ఎస్‌ బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్ సమైక్య పాలనలో సిరిసిల్ల అభివృద్ధికి నిధులు కేటాయించలేదన్నారు. ఈ ప్రాంతంపై నిధులు కేటాయించకుండా వివక్ష చూపించారని మండిపడ్డారు కేటీఆర్. స్వరాష్ట్రంలో సిరిసిల్ల అన్నిరంగాల్లో అభివృద్ధి చెందిందని అభివృద్ధి,సంక్షేమం జోడెడ్ల లాగ ముందుకుసాగుతున్నామని చెప్పారు. నాలుగు నెలల్లో సిరిసిల్లలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

బీడీ కార్మికులు,ఒంటరి మహిళలు,వికలాంగులకు పింఛన్ అందిస్తున్నామని చెప్పారు.డిసెంబర్ 11 తర్వాత ఫించన్‌లు రెట్టింపవుతాయని..పింఛన్ అర్హత వయస్సు 58 సంవత్సరాలకు తగ్గిస్తున్నట్లు చెప్పారు. నాడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం ధర్నాలు జరిగే పరిస్థితి ఉండేదని కానీ నేడు ఆపరిస్ధితి మారిందన్నారు. రైతులకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

పేదల సంక్షేమం కోసం బడ్జెట్‌లో పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతు బాంధవుడన్నారు. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలతో రైతులు ఆనందంతో ఉన్నారని చెప్పారు. రైతు బంధుతో ఎకరానికి 8 వేల పెట్టుబడి అందిస్తున్నామని చెప్పారు. కరెంట్ అడిగితే కాల్చి చంపినొళ్లతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని దివాళాకోరు రాజకీయాలు చేస్తోందన్నారు. దశాబ్దాల సిరిసిల్ల ప్రజల కల నాలుగేళ్లలో నెరవేరిందన్నారు. ఈ ఎన్నికలు అవకాశవాదానికి అభివృద్ధికి
జరుగుతున్న ఎన్నికలని ఎటు వైపు ఉంటారో తేల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్.

- Advertisement -