మాధవన్‌కి పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన 18 ఏళ్ల యువతి..!

508
madhavan
- Advertisement -

 హీరో మాధవన్‌ సఖి,చెలి,రన్,ప్రియా సఖి మొదలగు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. యుత్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమాలతో అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. ఇప్పటికీ అమ్మాయిల్లో ఈ యనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.అయన వయసు పై బడుతున్న ఇంకా అందగానే కనిపిస్తున్నారు. అయితే తాజాగా అయనపై మనసు పారేసుకుంది ఓ యువతీ. మాధవన్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ సెల్ఫీని పోస్ట్‌ చేశారు. అందులో నేను వృద్దుడిని అయిపోతున్నాను అని ఫన్నీ క్యాప్షన్ పెట్టారు.

దీనికి ఏకంగా నైనా అనే యువతి నాకు 18 ఏళ్ళు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను తప్పంటారా అని కామెంట్‌ని ఈ పోస్ట్ చేసింది. ఇందుకు మాధవన్‌ స్పందిస్తూ.. ‘హ్హ హ్హ.. గాడ్‌ బ్లెస్‌ యూ. నాకంటే మెరుగైన వ్యక్తి మీకు తప్పకుండా దొరుకుతాడు’ అని సమాధానమిచ్చారు. మాధవన్‌కు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్‌ ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని దీనిని బట్టే తెలుస్తోంది.

ప్రస్తుతం ఆయన ‘రాకెట్రీ: ది నంబీ ఎఫెక్ట్‌’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ పాత్రలో నటిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత అనంత్‌ మహాదేవన్‌, మాధవన్‌ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. అలాగే ఈ మూవీతో పాటు.. ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో అనుష్కకు జోడీగా నటిస్తున్నారు మాధవన్‌.

- Advertisement -