ఆ ట్రిక్‌ను మిస్ అయ్యారు!

3
- Advertisement -

భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ కేవలం ఎనిమిది బంతులకే ముగిసింది. ఈ ఎనిమిది బంతుల్లో అతడు ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వైభవ్‌కు ఇది ఒక విలువైన పాఠమని అయితే అతడితో మరో ఎండ్‌లో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. వైభవ్ ఒత్తిడిని తగ్గించేందుకు మరింత ప్రయత్నించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.

తన యూట్యూబ్ ఛానెల్‌లో అశ్విన్ మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ లాంటి యువ బ్యాటర్ కొత్త పరిస్థితులకు అలవాటు పడటం కష్టమే. అతడు అలా అలవాటు పడగలిగితే మంచిదే. ఎందుకంటే అతడు తరతరాలకు గుర్తుండిపోయే ప్రతిభ కలిగిన ఆటగాడు. ఈ రోజు వైభవ్‌తో పాటు అభిషేక్ శర్మ బ్యాటింగ్ చేస్తున్నాడు. అభిషేక్ శర్మ వ్యక్తిగతంగా నాకు తెలియదు. అయితే వైభవ్ ఎనిమిది బంతులు ఆడినా ఒక్కసారి కూడా తన షాట్లను సరిగ్గా టైమింగ్ చేయలేకపోయాడు.

మరో ఎండ్‌లో ఉన్న సీనియర్ ఆటగాడిగా అభిషేక్ అతడి దగ్గరకు వెళ్లి ధైర్యం చెప్పాల్సింది. వైభవ్ ప్రశాంతంగా కనిపించలేదు. అలాంటి సమయంలో సింగిల్స్ తీస్తూ స్ట్రైక్ మార్చుకోవాలని అతడికి సూచించాల్సింది. కానీ ఆ అవకాశాన్ని మిస్ అయ్యారు” అని అశ్విన్ పేర్కొన్నాడు. వైభవ్‌కు ఈ మ్యాచ్ ఒక విలువైన పాఠంగా మిగిలిపోతుందని తెలిపాడు.

Also Read:తెలంగాణకు అమిత్ షా..డేట్ ఫిక్స్

భారత జట్టు మేనేజ్‌మెంట్ వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకునేందుకు తొందరపడకూడదని ఇప్పటికే సంజూ శాంసన్, అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శనలు చేస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నారని పేర్కొన్నాడు. వైభవ్‌కు తుది జట్టులో అవకాశం రాకపోతే నిరాశ చెందాల్సిన అవసరం లేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఈ దశలో అతడు నేర్చుకునే చిన్న చిన్న విషయాలే భవిష్యత్తులో గొప్ప ఆటగాడిగా ఎదగడానికి ఉపయోగపడతాయని పేర్కొన్నాడు.

- Advertisement -