యష్ చేతికి ‘రామాయణ’!

4
- Advertisement -

రాకింగ్ స్టార్ యష్ మరో కీలక బాధ్యతను చేపట్టారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న రామాయణం: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే నటుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఆయన తాజాగా కర్ణాటకలో ఈ చిత్ర పంపిణీ బాధ్యతలను కూడా తీసుకున్నారు. తన సొంత రాష్ట్రంలో సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.

యష్‌కు చెందిన మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్ ద్వారా కర్ణాటకలో రామాయణం పంపిణీ చేయనున్నారు. గతంలో టాక్సిక్ సినిమాతో డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి అడుగుపెట్టారు యష్‌. తాజాగా రామాయణంను కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు యష్.

రామాయణం సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తుండగా నమిత్ మల్హోత్రా నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read:TTD:తిరుమలలో భక్తుల రద్దీ

ఈ ఇతిహాస చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

- Advertisement -