బీజేపీ గెలిచిన చోటే అల్లర్లు: దీదీ

26
mamatha

బెంగాల్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలను తాము సహించబోమని స్పష్టం చేశారు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రంలో బీజేపీ గెలిచిన చోట్లే అల్లర్లు, హింస చెలరేగిందని వెల్లడించారు. తొలిసారి ప‌శ్చిమ‌బెంగాల్లో ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం చెల‌రేగిన హింస‌పై స్పందించిన ఆమె…ప‌శ్చిమ‌బెంగాల్ ఐక‌మ‌త్యానికి నిద‌ర్శ‌న‌మని, ఇక‌పై ఎవ‌రు హింస‌కు పురికొల్పినా స‌హించ‌బోన‌ని హెచ్చ‌రించారు.

పాత వీడియోల‌ను సోష‌ల్ మీడియాలో పెట్టి బీజేపీ త‌ప్పుడు ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌చారం చేస్తున్న‌ద‌ని మ‌మ‌తాబెన‌ర్జి అరోపించారు. ఏదేమైనా ఇలాంటి హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని అన్ని పార్టీల వారిని కోరారు.