సల్మాన్‌…ఖైదీ నెం. 106

207
Qaidi No. 106, Salman Khan
- Advertisement -

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 1998లో కృష్ణ జింకలను వేటాడిన కేసులో 20 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం తీర్పు వెలువడిన సంగతి తెలిసిందే. సల్మాన్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష విధించిన జోధ్‌పూర్ కోర్టు రూ. 10వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సల్మాన్‌ను జోధ్ పూర్‌ జైలుకు తరలించగా బారక్‌ నెంబర్ 2ను కేటాయించారు. ఇక సల్మాన్‌కు ఖైదీ నెంబర్ 106 జెర్సీని కేటాయించినట్లు తెలిపారు.

సల్మాన్‌ను సాధారణ ఖైదీగానే పరిగణిస్తున్నామని.. గదిలో చెక్క మంచం, దుప్పటి, కూలర్ మాత్రమే ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే,గ్యాంగ్‌స్టర్‌ల నుంచి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో సల్మాన్‌కు భద్రత మాత్రం పెంచామని అధికారులు తెలిపారు. ఇక ఇదే బారక్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారాం బాపూజీ కూడా ఉన్నారు.

ఈ కేసులో సల్మాన్ ఖాన్ గతంలో 1998, 2006, 2007లో మొత్తం 18 రోజుల పాటు జైల్లో గడిపాడు. తనను దోషిగా తేల్చుతూ కోర్టు తీర్పు వెలువడగానే సల్మాన్ ఖాన్ తీవ్రమైన భావోద్వేగానికి గురైఏడ్చేశారు. కోర్టు తీర్పు సమయంలో పక్కనే ఉన్న సల్మాన్ సోదరీమణులు అర్పిత, అల్విరా ఖాన్ ఆయన్ను ఓదార్చే ప్రయత్నం చేశారు.

1998 అక్టోబరులో జోధ్‌పూర్ సమీపంలోని కంకణి గ్రామంలో సల్మాన్ ఖాన్ వేటాడటంతో రెండు కృష్ణ జింకలు చనిపోయానని అప్పట్లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదైంది. కాగా, శుక్రవారం జరిగే విచారణలో సల్మాన్ ఖాన్‌కు బెయిల్ వస్తుందా లేదా అనే దానిపై ఆయన అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

- Advertisement -