హుజుర్‌నగర్‌ టీడీపీ ఓటమి..పీవీపీ లెక్క చూడండి

541
pvp
- Advertisement -

హుజుర్‌ నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కారు జోరు ముందు టీడీపీ,బీజేపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. టీడీపీ,బీజేపీ ఓటమిపై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ముఖ్యంగా నిర్మాత పీవీపీ చెప్పిన లెక్క నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.

కొంతకాలంగా పీవీపీ,కేశినేని నాని మధ్య ట్విట్ల యుద్ధం నడుస్తుండగా మరోసారి హుజుర్‌ నగర్ ఉప ఎన్నికను బేస్ చేసుకుని టీడీపీపై విమర్శలు గుప్పించారు. హుజూర్ నగర్ లో తెలుగుదేశం కి వచ్చిన ఓట్లు 1895. 1+8+9+5 = 23. భగవంతున్ని భక్తుడిని అనుసంధానించేది అంబికా దర్బార్ బత్తి ఓటమిని తెలుగుదేశాన్ని అనుసంధానించేది 23 అంటూ ట్వీట్ చేశారు.

పీవీపీ లెక్క ప్రకారం ఏపీలో టీడీపీకి 23 సీట్లు మాత్రమే రాగా హుజుర్‌నగర్‌లో 1895 ఓట్లు రాగా వీటన్నింటిని కలిపితే 23.పీవీపీ చెప్పిన లెక్క బాగుందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. హుజూర్‌నగర్‌లో టీడీపీకి వచ్చింది 1827 ఓట్లని ఈసీ ఇచ్చిన లెక్కను ట్వీట్ చేస్తున్నారు.

- Advertisement -