హుజుర్‌నగర్‌ను అభివృద్ధి చేస్తా:ఎమ్మెల్యే సైదిరెడ్డి

311
saidireddy

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చి…హుజుర్‌నగర్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని తెలిపారు ఎమ్మెల్యే సైదిరెడ్డి. మేళ్లచెరువు మండల కేంద్రములో స్వయంభూ శంభు లింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సైదిరెడ్డి తన గెలుపు కోసం కృసి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు.

సీఎం కేసీఆర్ హుజుర్‌ నగర్‌ రావడం ప్రజల అదృష్టమని ప్రతి ఒక్కరు ఈ సభను విజయవంతం చేయాలన్నారు. హుజూర్‌నగర్ ని అభివృద్ధి ఎలా చేయాలో దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అభివృద్ధి పథంలో నడిపిస్తానని తెలిపారు.

అంతకముందు హుజుర్‌నగర్‌ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించి పూలమాల వేశారు.