నాగార్జున సాగర్‌ను సందర్శించిన పీవీ సింధు..

287
pv sindhu
pv sindhu
- Advertisement -

నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు పోటెత్తింది.. శ్రీశైలం నుంచి రెండ్రోజులుగా వస్తున్న భారీ వరదతో నాగార్జునసాగర్‌ దాదాపుగా నిండింది. దీంతో సాగర్‌ గేట్లూ తెరుచుకున్నాయి. 20 క్రస్టుగేట్లు.. 20ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సాగర్‌ అందాలు చూడడానికి పెద్ద ఎత్తున పర్యటకు తరలివస్తున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ ప్రాజెక్టును కుటుంబసమేతంగా సందర్శించారు అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారిని పీవీ సింధు. అక్కడి అందాలను ఆస్వాధించారు.సింధూ ప్రాజెక్ట్‌ వద్ద కుటుంబీకులతో కలిసి నవ్వులు చిందిస్తూ ఫోటోలు దిగారు. సాగర్ చేరుకున్న సింధుకు స్థానిక అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్ట్‌ను దగ్గరుండి చూపించారు.

-ఇన్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు..
-అవుట్ ఫ్లో: 6,06,754 క్యూసెక్కులు..
-పూర్తిస్థాయి నీటినిల్వ: 312.0450 టీఎంసీలు..
-ప్రస్తుత నీటి నిల్వ : 312.0450 టీఎంసీలు..
-పూర్తిస్థాయి నీటిమట్టం: 590 అడుగులు..
-ప్రస్తుత నీటిమట్టం: 590 అడుగులు..

- Advertisement -