ఆయ‌న‌తో ప‌నిచేయ‌డం చాలా హ్యాపీ- ప్రియ‌మ‌ణి

81
Priya Mani

విక్ట‌రీ వెంక‌టేష్ హీరోగా, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నార‌ప్ప‌’. సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల అమేజాన్ ప్రైమ్‌ వీడియోలో విడుద‌లై స‌క్సెస్‌ఫుల్‌గా స్ట్రీమ్ అవుతోంది. ‘నారప్ప’గా వెంకీ అభినయం అందరినీ మెప్పిస్తోంది. సినిమాకు మంచి సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ హైద‌రాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియ‌మ‌ణి మాట్లాడుతూ.. నేను ఎప్ప‌టినుంచో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ లో వ‌ర్క్ చేయాలి అనుకున్నాను. ఆ అవ‌కాశం ఇచ్చిన సురేష్‌బాబుకి, డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్‌కు థ్యాంక్స్‌. వెంకీసార్ నార‌ప్ప పాత్ర‌లో ఒదిగిపొయారు. ‘నారప్ప’ నా కోరికలు చాలా వరకు తీర్చేశాడు అని అన్నారు. ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. కార్తిక్ రత్నం, రాకీ, బుజ్జ‌మ్మ ఇలా అంద‌రూ చాలా బాగా చేశారు“ అన్నారు. సినిమాని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్ అని అన్నారు.