ప్రపంచమంతటా మొదలైన పీవీ ఉత్సవాలు..

306
green
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన స్వర్గీయ మాజీ ప్రధాని పీ.వీ. నరసింహారావు గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఖండాంతరాల్లో మొట్టమొదటి కార్యక్రమం అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో గల కొలంబస్ నగరంలో తెరాస ఎన్నారై అడ్విసోరీ చైర్మన్ తన్నీరు మహేష్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా పీవీ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు కే.కేశవరావు గారు, ఉత్సవ కమిటి సభ్యులు మహేష్ బిగాల గారు, పీవీ కూతుర్లు సురభి వాణి దేవి గారు పాల్గొన్నారు , కలకోట సర్వసతి గారు 50 సంవత్సరాల నుంచి అమెరికా లో నివాసం వున్నారు , ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొని పీవీ గారి స్మృతులను గుర్తుచేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాల ప్రవాస భారతీయులు, పీవీ అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కోవిద్ పరిమితుల దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అమెరికాలో లోని వివిధ రాష్ట్రాల నుండి పీవీ అభిమానులు వందల సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని టీవీ ఆసియ తెలుగు వారు ప్రత్యక్ష ప్రసారం చేసారు.కేశవ రావు గారు మాట్లాడుతూ జ్ఞ్యాన సమున్నత, విధాన నిర్ణయాలు, రాజనీతి, సాహితి సాంస్కృతిక, పరిపాలన, ఆధ్యాత్మికత విషయాల్లో పీవీ గారు ఆయనకు ఆయనే సాటి అని, ఆర్ధిక సంస్కరణలతో ఆధునిక భారతాన్ని ఆవిష్కరించిన దూరాదృష్టి గల నాయకుడని అన్నారు. ప్రధాన మంత్రిగా మరియు వివిధ మంత్రిత్వ హోదాల్లో పీవీ గారు భారత దేశానికి చేసిన సేవలను గుర్తుచేస్తూ వారికి భారత రత్న ప్రదానం చేయడమే సరైన గౌరవ మని, భారత రత్న పురస్కారం గురించి పార్లమెంట్ లో నివేదిస్తామన్నారు.

శతజయంతి ఉత్సవాల్లో భాగంగా ఏడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు, స్మృతి మందిర నిర్మాణం, పీవీ స్వగ్రామమైన వంగరలో స్మారక చిహ్నం, అంతర్జాతీయ స్థాయిలో ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు.పీవీ శతజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల గారు మాట్లాడుతూ సీఎం కెసిఆర్ సూచన మేరకు ఏడాది పాటు ప్రపంచవ్యాప్తంగా యాబై దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ అమెరికా, బ్రిటన్, దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా , న్యూజీలాండ్ , సింగపూర్, మలేషియా మరియు మారిషెస్ దేశాల్లో పీవీ గారి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ ఇంకా ముఖ్య నగరాల్లో విగ్రహ ఏర్పాట్లకు ప్రణాళిక రూపాందించామన్నారు అలాగే పీవీ గారికి భారత రత్న ఇవ్వాలని ఆన్లైన్ లో పిటిషన్ ( https://www.change.org/BharatRatnaforPV) లాంచ్ చేసారు , దీని ద్వారా ప్రపంచమంతటా పీవీ అభిమానులు ఆన్లైన్ లో తమ మద్దతు తెలియజేయాలని అన్నారు , అలాగే ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు వచ్చే ఏడాది హైదరాబాద్ లో నిర్వహించే పీవీ శతజయంతి వేడుకలకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్ను ముఖ్య అతిధిగా ఆహ్వానించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని చెప్పారు.

పీవీ నరసింహ రావు గారి వ్యక్తిత్వము మరియు వారి యొక్క భావవ్యక్తీకరణ విధానం గూర్చి వారి కూతురు డాక్టర్ సరస్వతి గారి మాటలలోనే “చేతలు మరియు నడవడి ద్వార ఎదుటి వారిపై చెదరని ముద్ర వేసే వారు ఇంకా మనము ఏదైనా కార్యసాధన చేసేటప్పుడు ఆ పనిలో మనస్ఫూర్తిగా నిమగ్నమైనప్పుడే ఆ పని విజయవంతం చేయగలము అని చెప్పే వారు. అది నా వ్యక్తిత్వము మరియు నడవడిలో చెరగని ముద్ర వేసినాయి”.పీవీ గారు అతి సామాన్యంగా ఉండడానికి ఇష్టపడేవారు, ప్రకృతితో పాటు దేశాన్ని కూడా ఆరాధించేవారు మరియు నిత్యం యోగ సాధన చేసేవారని వారి కూతురు సురభి వాని దేవి గారు అన్నారు.

తన్నీరు మహేష్ గారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారి సూచనల మేరకు పీవీ శతజయంతి ఉత్సవాలను అమెరికాలోని ముఖ్య నగరాల్లో నిర్వహించడానికి అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని వివిధ సంఘాల సమన్వయంతో ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీ.సీ మరియు ఇతర నగరాల్లో పీవీ విగ్రహావిష్కరణ, పీవీ బహుముఖప్రజ్ఞకు అద్దంపట్టేలా, ఔన్నత్యం దశ దిశలా చాటే విదంగా జాతీయ స్థాయి సదస్సులు, కార్యక్రమాలు ఏడాది పాటు ప్రతినెలా నిర్వహిస్తామన్నారు. 1994 పీవీ గారి అమెరికా పర్యటన గుర్తుచేస్తూ.. ఆ సందర్బంగా అధ్యక్షుడు బిల్‌క్లింటన్‌తో సమావేశం లో తలెత్తే ప్రశ్నలను పీవీ గారు ముందుగా అంచనా వేసి వివరించడంతో.. క్లింటన్ భారత దేశంలో పెట్టుబడులు, ఆర్ధిక విధానాలపై మరింత ఆసక్తి చూపి భేటీ నిర్ణీత సమయం కన్నా మరో ఇరవై నిమిషాలు కొనసాగించి మన దేశానికి పెట్టుబడులను అందించారని అన్నారు.

ఈ కార్యక్రమ ఏర్పాటుకు ముందుండి అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నారై టి.ఆర్.స్ రీజినల్ కోఆర్డినేటర్ కానుగంటి నవీన్ గారిని పలువురు అభినందించారు. ఈ సమావేశంలో ప్రముఖ ప్రవాస భారతీయులు నీల్ పటేల్, కొలంబస్ తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రవణ్ చిద్రూప, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఛైర్మెన్ రామకృష్ణ కాసర్ల, అధ్యక్షుడు రజినీకాంత్ కట్టే, ఎన్నారై టి.ఆర్.స్ కార్యదర్శి నరసింహ నాగులవంచా సెంట్రల్ ఒహియో తెలుగు అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ చలసాని, ఎస్.వి టెంపుల్ ట్రస్టీ కేశవ రెడ్డి, అశోక్ ఇల్లందుల, అమర్ రెడ్డి, రమేష్, సాలందరి, కిరణ్, డేవిడ్, గోవర్ధన్, వంశీ, కే.కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -