స్వీడన్‌లో ఘనంగా పీవీ జయంతి ఉత్సవాలు..

170
TRS NRIs

అపర చాణుక్యుడు , బహుముఖ ప్రజ్ఞాశాలి, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహ రావు శతజయంతి ఉత్సవాలు స్వీడన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టాక్‌హొల్మ్‌లో ఉన్న స్వీడన్ తెలుగు అస్సోసియేషన్ సభ్యులతో కలిసి తెలుగు వారంతా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించి,సభ్యులంతా పీవీ మన ఠీవి అని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా స్వీడన్ తెలుగుసంగం సభ్యులు సురేంద్ర, మహేందర్ శర్మ మరియు రమేష్, ఇంకా పలువురు వక్తలు ప్రసంగించారు.

పీవీ నరసింహ రావు ఆర్ధిక సామజిక రంగంలో తనదైన శైలిలో ఎన్నో మార్పులు చేసి దివాలా తీసే స్థాయికి చేరుకున్న ఆర్థికవ్యవస్థకు పునరుజ్జీవం కల్పించేందుకు పలు సంస్కరణలకు బీజం వేశారు. తెలుగు వాడైన మన పీవీ నరసింహారావు మంత్రిగా, ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా భరతమాతకు తన సేవలను అందించారు. ఈ బహుభాషా కోవిదునికి ఈ ఎడాది పాటు ప్రపంచ వ్యాప్తంగా 51 దేశాల్లో ఈ వేడుకలు ఘనంగా జరుపుకోనున్నారు.

కరోనా కారణంగా సభ్యులాంతా నిరాడంబరంగా వేడుక జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో, సురేద్ర,గంగాధర్ నీరడి, అనిత రమేష్ దేసు, శృతి, అజిత, మంజూష పంజా, మార్క్స్ దమ్మాలపాటి, కవిత, అరుణ్, సుమన్ మొఖమాటం, కిషోర్ వడ్ల పట్ల, వినోద్ చలింద్ర, అర్జున్, బసవ కాకర్ల, రాజేంద్ర, శ్రీనివాస్ తాడివాక, విశ్వనాధ్ బెజవాడ, వంశీ, రామ్ ప్రసాద్, రమ్య, జ్యోతి, అరుణ, కృష్ణ పాల్గొన్నారు.