నన్ను చంపాలని చూశారు: పువ్వాడ అజయ్

7
- Advertisement -

నన్ను చంపాలని చూశారు.. నన్ను చంపితే ఖమ్మం వరద బాధితుల సమస్యలు తీరుతాయా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్. మా ఉద్యమ నాయకులపై, నాపై భౌతిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకుంటామా? అని మండిపడ్డారు. మీడియాతో మాట్లాడిన పువ్వాడ…వరద వస్తుందని ఖమ్మం ప్రజలకు ముందు చెప్పలేదు.. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యం అన్నారు.

శనివారం రోజు 21 అడుగులకు నీటిమట్టం చేరింది, 21 అడుగులకు చేరిన ఒక ఇల్లు కూడా మునగదు అన్నారు. కాకపోతే నీటిమట్టం 18 అడుగులకు చేరగానే మైకులలో అనౌన్స్మెంట్ ఇచ్చి ట్రాక్టర్లు వ్యాన్లు తీసుకొచ్చి ప్రజలను సామాగ్రితో సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. ఆదివారం ఉదయం 33 అడుగులకు నీటిమట్టం చేరింది, అప్పటికి ప్రభుత్వం ఎలాంటి హెచ్చరికలు గాని అనౌన్స్మెంట్ గాని చేయలేదు అన్నారు పువ్వాడ. ప్రజలే స్వచ్ఛందంగా అయ్యో రామచంద్ర అని అనుకుంటూ వారి సోమాగ్రిని వదిలేసి వేరే ప్రాంతంలోకి వెళ్లిపోయారన్నారు.

మాకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రజల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ.. రిలీఫ్ మెజర్స్ తీసుకోవడంలో బాధితులకు ఆహారం, నీళ్లు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అన్నిటి నుంచి డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై ఆరోపణలు చేశారు అని..వరదను అంచనా వేయలేక – నాపై బురద జల్లుతున్నారు అని మండిపడ్డారు అజయ్.

Also Read:ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ విరాళం

- Advertisement -