2 కోట్లిస్తే…నా ఆస్తి రాసిస్తా: పుట్ట మధు

335
putta madhu
- Advertisement -

తనపై వస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు మంథని తాజా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ నేత మాజీ మంత్రి శ్రీధర్ బాబు ముఠాలకు బాధ్యత అప్పజెప్పారని తెలిపారు. తన ఆస్తి రూ. 900 కోట్లు అని ప్రచారం చేస్తున్నారని…రూ.2 కోట్లు ఇస్తే తన ఆస్తులు రాసిస్తానని తేల్చి చెప్పారు.

ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే తనమీద అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అట్టడుగు స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగిన తనను రాజకీయంగా అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని..తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు విశ్వసించరని స్పష్టం చేశారు.

ఓడిపోతాననే భయంతో శ్రీధర్‌బాబు ఇలాంటి అడ్డదారులు తొక్కుతున్నారని…నా పై కేసులు ఉంటే శ్రీధర్ బాబు మంత్రిగా ఉన్నప్పుడు వదిలిపెట్టేవారా అని ప్రశ్నించారు. తనపై కేసులు వేసినవారంతా క్రిమినల్సే అని అన్నారు. నాగరాజు ఆత్మహత్య కేసులో రమణారెడ్డి ముద్దాయి అని పేర్కొన్నారు.

పుట్టా మధు నుండి తనకు ప్రాణహాని ఉందంటూ బిల్ల రమణారెడ్డి అనే యువకుడు డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీజీపీ స్థానిక పోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో స్పందించిన ఆయన ఆరోపణలను కొట్టిపారేశారు.

- Advertisement -