గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొన్న పెద్దపల్లి జడ్పి చైర్మెన్ పుట్ట మధు..

119
Peddapalli ZP Chairman Putta Madhu
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ఈరోజు తన జన్మదినాన్ని పురస్కరించుకునిపెద్దపల్లి జిల్లా జడ్పి చైర్మెన్ పుట్ట మధు మొక్కలు నాటారు. సోమవారం ఆయన మంథని పట్టణంలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.

అనంతరం పుట్ట మధు మాట్లాడుతూ..మొక్కలు నాటే ఈ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉంది అని… భవిష్యత్తు తరాలకు ప్రకృతి సమతుల్యం ఈ ఉద్యమం ద్వారా అందివస్తాయన్నారు. అందరం అందరికోసం హరిత తెలంగాణను సృష్టిద్దాం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొందాం అని కోరారు.

- Advertisement -