బన్నీ పుష్ప రిలీజ్ డేట్ ఖరారు..ఎప్పుడో తెలుసా?

149
allu arjun
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఆగస్టు 13న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ జరుపుకునేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్ సినిమాను తెరకెక్కిస్తుండగా రష్మికా మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

ఐదు భాషల్లో రూపొందుతున్న ఈ పాన్‌ ఇండియా చిత్రంలో బన్నీ పాత్ర రఫ్‌గా ఉండబోతుంది. ఈ సినిమా పోస్టర్‌లోనూ బన్నీ పుష్పరాజ్‌ అనే స్మగ్లర్‌గా మాస్‌ లుక్‌లో కనిపించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -