ఢిల్లీ…రైతు సంఘాల నాయకులకు నోటీసులు

157
delhi police
- Advertisement -

రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారగా వందల సంఖ్యలో రైతులు, పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు ర్యాలీలో 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయగా ఇప్పటివరకు 200 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.ఎఫ్‌ఐఆర్‌లలో పేర్లు నమోదుచేసిన వారిలో ఆరుగురు రైతు సంఘాల నేతలు రాకేశ్ తికాయట్, దర్శన్ పాల్, రాజిందర్ సింగ్, బల్బీర్ సింగ్ రాజేవాల్, బుటాసింగ్ బుర్జ్‌గిల్, జోగిందర్ సింగ్ ఉన్నారు.

తాజాగా 20 మంది రైతు ప్ర‌తినిధుల‌కు నోటీసులు పంపారు. కిసాన్ ర్యాలీలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై మూడు రోజుల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆ రైతుల‌ను పోలీసులు ఆదేశించారు.

ఇక రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ర్యాలీ హింసాత్మకంగా మారడంపై కేంద్రం కన్నెర్ర చేసింది. ఘటనపై ఇప్పటికే కేసులు నమోదుచేయగా ఇవాళ గాయపడిన పోలీసులను పరామర్శించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. వారి ఆరోగ్య ప‌రిస్థితి వివ‌రాల‌ను వైద్యుల‌ను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -