పుష్పకవిమానం..ఎంతోమందిని కాదని అమలకే దక్కింది.!

39
- Advertisement -

సింగీతం శ్రీనివాసరావు అంటే తెలుగు సినీ పరిశ్రమలో తెలియని వారుండరు. అలాగే ఈయన చేసిన ప్రయోగాత్మక సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. అలాంటి వాటిలో పుష్పకవిమానం సినిమా ఒకటి. మాటలు లేకుండా తీసిన ఈ సినిమా…హీరోయిన్ కోసం ఒక పెద్ద యుద్ధమే చేసినట్టుగా నడిచిందని అన్నారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కోసం చేసిన ప్రయత్నాలను పంచకున్నారు.

ఈ సినిమా కోసం మొదట నీలమ్ కొఠారి అనే హిందీ అమ్మాయిని అనుకున్నారు. కానీ ఆమె పెట్టిన షరతులకు అంగీకరించలేదన్నారు. అలాగే ప్రముఖ హిందీ దర్శకుడు రమేశ్‌సిప్పిని అడిగితే చెప్పారట. ఒక అమ్మాయి ఉంది. చాలా అందంగా ఉంటుంది. కానీ ఇప్పటివరకూ ఒక్క సినిమా కూడా షూటింగ్ పూర్తికాలేదు అని తెలిపారు. ఆమెది ఐరన్‌లెగ్‌ అని అందరూ బాలీవుడ్‌లో పిలిచేవారని అన్నారు. మీకు అలాంటి సెంటిమెంట్‌ లేకపోతే నిరభ్యంతరంగా వెళ్లి కలవండి అని సలహా ఇచ్చారని తెలిపారు. ఆమె పేరు మాధురీదీక్షిత్‌ అని చెప్పారు. ఎలాగో కష్టపడి అడ్రస్‌ వెతికి పట్టుకున్నామని తెలిపారు.

అయితే ఆమె పీఏ ఇలాంటి సినిమా మా మేడమ్ చేయదని ఖరాకండీ చెప్పారని తెలిపారు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వాళ్లు నాకు సన్మానం చేస్తే అక్కడికి అమల వచ్చారు. సినిమా కోసము వివరాలు అడిగితే అంతకుముందు శివాజీగణేషన్‌తో కలిసి సినిమా తీసినట్టు తెలిపింది. దీంతో ఈమెను మా సినిమాలోకి తీసుకున్నా అంటూ కథానాయిక కోసం చేసిన పోరాటాన్ని చెప్పుకొచ్చారు. అయితే ఇదే విషయం మాధురీదీక్షిత్‌తో మరో సినిమా చేస్తున్న సందర్భంలో ఈ విషయం చెబితే ఆమె తల కొట్టుకుంటూ ఎవడు వాడు..మంచి ఛాన్స్‌ పోగొట్టారని ఆగ్రహంతో పీఏను మందలించిదని అన్నారు.

ఇవి కూడా చదవండి…

ఎన్టీఆర్ – బన్నీ సినిమా షురూ

మహేష్ తో పదేళ్లు.. ఒకే సినిమా

బాలీవుడ్‌ స్టార్‌కు బెదిరింపు కాల్‌..!

- Advertisement -