OTT:ఓటీటీలోకి కబ్జ ఎప్పుడంటే..!

95
- Advertisement -

స్వాతంత్య్రానికి పూర్వం ఆ తర్వాత జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన సినిమా కబ్జ. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్ లాంటి ముగ్గురు కన్నడ స్టార్లు కలిసి నటించిన ఈసినిమా…ఆర్ చంద్ర దర్శకత్వం వహించారు. గతనెల ప్రపంచవ్యాప్తంగా విడుదలైన… ఈ సినిమా అనుకున్న విజయంను సాధించలేకపోయింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.

ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 14నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ట్వీట్ చేసింది. 1960ల కాలం నాటి నేపథ్యంలో జరిగే గ్యాంగ్‌స్టర్‌ మూవీ. ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా ఉపేంద్ర నటించారు. శ్రియశరణ్‌, కబీర్, దుహాన్‌సింగ్, నవాబ్‌షా, ప్రమోద్‌శెట్టి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి…

పుష్పకవిమానం..ఎంతోమందిని కాదని అమలకే దక్కింది.!

ట్రైలర్ టాక్ : విరూపాక్ష ఇక కష్టమే

అనుపమ కొత్త అవతారం

- Advertisement -