‘పుష్ప’ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌..

85
Pushpa trailer
- Advertisement -

టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్,డైరెక్టర్‌ సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్‌కు జోడిగా రష్మిక మందన్న నటిస్తోంది. ఇందులో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఫస్ట్ పార్ట్ డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదలకానుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.

ఇక పుష్ప మూవీ ట్రైలర్‏ను డిసెంబర్ 6న సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్బంగా పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే.

- Advertisement -