భైంసాలో బైక్‌ల దొంగల అరెస్ట్.. 13బైకులు స్వాధీనం..

41

నిర్మల్ జిల్లా భైంసాలో బైక్ దొంగతనం చేస్తున్న దొంగలను పట్టుకొని మీడియా ముందు హజరు పర్చారు భైంసా ఏఎస్పీ కిరణ్ కారె. ఆదివారం భైంసాలో అనుమాస్పదంగా తిర్గుతున్న శ్రీకాంత్,అబ్బులు అనే ఇద్దరిని సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా గుర్తించి విచారించగా వారి వద్ద దొంగలించిన బైక్ లభించింది అని..వీరు నిర్మల్,నిజమాబాద్ జిల్లాల్లో బైకులను అపహరించి వాటిని అమ్మితె వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవారని తెలిపారు. వీరు దొంగలించిన వాటిని నిజమాబాద్ జిల్లా ఎడపెల్లికి‌‌ చెందిన శ్రీకాంత్,రవికాంత్ గౌడ్,శివాజీలకు అమ్మెవారని తెలిపారు. వీరి వద్ద నుండి పన్నెండు బైక్ లు,దొంగలించిన వ్యక్తి వద్ద ఉన్న ఒక బైక్‌తో కలిపి మొత్తం పదమూడు బైక్ లను రికవరీ చేశారు పోలీసులు. భైంసా ఏఎస్పీ కిరణ్ కారె మీడియాతో మాట్లాడుతూ.. నేరాలను అరికట్టడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కావునా ప్రతీ ఒక్కరు తమ దుకాణాల ముందు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.