టీఆర్ఎస్‌ గెలుపుకు కృషిచేస్తా: మాజీమంత్రి పెద్దిరెడ్డి

79
peddireddy

బీజేపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పారు. త్వరలో తాను టీఆర్ఎస్‌లో చేరుతానని తెలిపిన పెద్దిరెడ్డి… ఆ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషిచేస్తానని వెల్లడించారు.

బీజేపీలో పరిస్థితిలు తనకు నచ్చలేదని అయితే ఆ పార్టీపై విమర్శలు చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తానని ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని వెల్లడించారు.

బీజేపీ నుంచి హుజురాబాద్‌ స్థానాన్ని ఆశించారు పెద్దిరెడ్డి. కానీ, సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. బీజేపీ గూటికి చేరడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి బీజేపీకి అంటిముట్టనట్టుగా ఉంటూ వచ్చిన ఆయన ఈటలపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.